Thursday, October 21, 2010
ఆ జీవో ఏమైంది ? స్విమ్స్‌లో అమలుకాని టిటిడి ఆదేశాలు
స్విమ్స్‌లోని కాంట్రాక్టు ఉద్యోగులకు రోజుకు రూ. వంద పెంచాలని టిటిడి జారీ చేసిన జీవో అమలు కాలేదు. దీనిపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తిరుపతిలోని స్విమ్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు వెయ్యి మంది ఐదేళ్ల నుంచి పదేళ్లుగా పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులుగా , రిసెప్షనిస్టులుగా , కంప్యూటర్ ఆపరేటర్లుగా , టెక్నికల్ సిబ్బంది , పీఏలుగా ఉన్నారు. వీరికి అనుభవం , సీనియారిటీ ప్రకారం జీతాలు పెంచాలి. కానీ , స్విమ్స్‌లో ఏళ్ళతరబడి చదువుకున్న , చదువులేని వారికీ ఒకే రకమైన జీతాలు ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ. 221 , అన్‌స్కిల్డ్ వారికి 205 , సెమీ స్కిల్డ్ సిబ్బందికి రూ. 221 ఇస్తున్నారు. దీనిపై టిటిడి అధికారులు స్పందించి , ఐదేళ్ల పైబడిన వారందరికీ సరైన న్యాయం చేయాలని , రోజుకు రూ. వంద పెంచాలని జీవో జారీచేశారు. దీని అమలును స్విమ్స్ యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయమని వారు ఆవేదన చెందుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment