Thursday, October 21, 2010

మళ్లీ ఎస్కలేటర్‌ ప్రతిపాదనపై త్వరలో చర్చ

శ్రీవారి దర్శన విధి విధానాలపై నవంబరు 20, 21వ తేదీల్లో తిరుపతిలో టీటీడీ సదస్సు నిర్వహించనుంది. తొలుత నవంబరు 13,14న సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, 13న పుష్పయాగం సేవ ఉన్నందున మార్పు చేశారు. 20వ తే దీన రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి సదస్సును ప్రారంభించనున్నారు. టీటీడీ మాజీ ఈవోలు ఐవీ సుబ్బారావు, అజేయకల్లం ఈ సదస్సులో ఉపన్యసిస్తారు. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించవచ్చు.

21వ తేదీన ఆగమాలు, దర్శనం విషయంలో టీటీడీ మాజీ ఈవో పీవీ ఆర్‌కే ప్రసాద్, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, సుందర వరదన్ భట్టాచార్యులు, విష్ణు భట్టాచార్యులు, జగన్నాథాచార్యులు ప్రసంగిస్తారు. ఆలయంలో ఎక్స్‌లేటర్ (మూవింగ్ ప్లాట్‌ఫాం) అమలు విషయంలో బెంగళూరుకు చెందిన రంగనాథ్ ప్రసంగిస్తారు. అవసరమైతే తిరుపతిలో ఏర్పాటు చేసిన నమూనా శ్రీవారి ఆలయంలో ఎక్సలేటర్‌పై అవగాహన కల్పిస్తారు. ధర్మప్రచారం అన్న అంశంపై థార్మిక కౌన్సిల్ చైర్మన్ రాంబాబు, అరుల్ మల్లిగి పార్థసారథి, చెలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు సౌందర్‌రాజన్ ప్రసంగిస్తారు. మేధావుల సూచనలు, సలహాలను టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదించాకే నిర్ణయం అవుతాయని ఈవో కృష్ణారావు స్పష్టంచేశారు.

సాధారణంగా ఆలయంలో లఘు అయితే గంటకు 3 వేల మంది , మహాలఘుఅయితే 5 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. రద్దీలేనప్పుడు కులశేఖరపడి వరకూ సామాన్యభక్తులను అనుతమిస్తున్నారు. ఎస్కలేటర్‌ ఏర్పాటు వలన సిబ్బందిపై దీర్ఘకాలంగా వస్తున్న విమర్శలకు చెక్‌పెట్టడమేకాకుండా , గంటకు 7 వేల మందికి స్వామివారి దర్శనాన్ని కల్పించవచ్చనే అంచనా వేస్తున్నారు. తలిగెలు , ఉత్సవమూర్తుల తరలింపు లాంటిసమస్యలు అర్చకులు ఈఓ దృష్టికి తెచ్చారు. దీనిపై వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. టిటిడి మాజీ ఈవో ఐవి. సుబ్బారావు కూడా ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని పేర్కొనడం గమన్హారం.

No comments:

Post a Comment