Thursday, October 21, 2010

వెంకన్న సొమ్ముతో కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారం

సెక్యూరిటీ గార్డుల కాంట్రాక్టర్స్‌ గార్డులకివ్వాల్సిన 4 నెలల జీతంతో వడ్డీవ్యాపారం చేస్తున్నారు. దీంతో గత 4 నెలలుగా జీతాలు అందక టిటిడిలోని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు నానా అవస్థలు పడుతున్నారు. టిటిడిలో మొత్తం 1000 మందికి పైగా ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నాలుగు ప్రైవేట్‌ సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ సంస్థలు టిటిడికి ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను సరఫరా చేస్తుంది. ఈ నాలుగు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌ సంస్థలకు నెలకు 60 లక్షలకు పైగా జీతాలుగా టిటిడి చెల్లిస్తోంది. ఇలా గత 4 నెలలుగా చెల్ల్లించిన 2 కోట్ల రూపాయలను ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థలు వడ్డీకి వ్యాపారం చేస్తూ సెక్యూరిటీ గార్డ్స్‌కు జీతాలు చెల్లించడంలేదు. ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుల జీతంకోసం ఏజెన్సీలను ప్రశ్నిస్తే ఇంకా టిటిడి జీతాలు ఇవ్వలేదని చెబుతున్నారు. టిటిడి అధికారులు తాము చెల్లించామని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులకు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టిటిడిలో పరమనెంట్‌గా ఉండే సెక్యూరిటీ ఉన్నతాధికారి కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment