Thursday, October 21, 2010

ఆ జీవో ఏమైంది ? స్విమ్స్‌లో అమలుకాని టిటిడి ఆదేశాలు

స్విమ్స్‌లోని కాంట్రాక్టు ఉద్యోగులకు రోజుకు రూ. వంద పెంచాలని టిటిడి జారీ చేసిన జీవో అమలు కాలేదు. దీనిపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తిరుపతిలోని స్విమ్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు వెయ్యి మంది ఐదేళ్ల నుంచి పదేళ్లుగా పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులుగా , రిసెప్షనిస్టులుగా , కంప్యూటర్‌ ఆపరేటర్లుగా , టెక్నికల్‌ సిబ్బంది , పీఏలుగా ఉన్నారు. వీరికి అనుభవం , సీనియారిటీ ప్రకారం జీతాలు పెంచాలి. కానీ , స్విమ్స్‌లో ఏళ్ళతరబడి చదువుకున్న , చదువులేని వారికీ ఒకే రకమైన జీతాలు ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం స్కిల్డ్‌ వర్కర్లకు రోజుకు రూ. 221 , అన్‌స్కిల్డ్‌ వారికి 205 , సెమీ స్కిల్డ్‌ సిబ్బందికి రూ. 221 ఇస్తున్నారు. దీనిపై టిటిడి అధికారులు స్పందించి , ఐదేళ్ల పైబడిన వారందరికీ సరైన న్యాయం చేయాలని , రోజుకు రూ. వంద పెంచాలని జీవో జారీచేశారు. దీని అమలును స్విమ్స్‌ యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయమని వారు ఆవేదన చెందుతున్నారు.

మళ్లీ ఎస్కలేటర్‌ ప్రతిపాదనపై త్వరలో చర్చ

శ్రీవారి దర్శన విధి విధానాలపై నవంబరు 20, 21వ తేదీల్లో తిరుపతిలో టీటీడీ సదస్సు నిర్వహించనుంది. తొలుత నవంబరు 13,14న సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, 13న పుష్పయాగం సేవ ఉన్నందున మార్పు చేశారు. 20వ తే దీన రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి సదస్సును ప్రారంభించనున్నారు. టీటీడీ మాజీ ఈవోలు ఐవీ సుబ్బారావు, అజేయకల్లం ఈ సదస్సులో ఉపన్యసిస్తారు. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించవచ్చు.

21వ తేదీన ఆగమాలు, దర్శనం విషయంలో టీటీడీ మాజీ ఈవో పీవీ ఆర్‌కే ప్రసాద్, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, సుందర వరదన్ భట్టాచార్యులు, విష్ణు భట్టాచార్యులు, జగన్నాథాచార్యులు ప్రసంగిస్తారు. ఆలయంలో ఎక్స్‌లేటర్ (మూవింగ్ ప్లాట్‌ఫాం) అమలు విషయంలో బెంగళూరుకు చెందిన రంగనాథ్ ప్రసంగిస్తారు. అవసరమైతే తిరుపతిలో ఏర్పాటు చేసిన నమూనా శ్రీవారి ఆలయంలో ఎక్సలేటర్‌పై అవగాహన కల్పిస్తారు. ధర్మప్రచారం అన్న అంశంపై థార్మిక కౌన్సిల్ చైర్మన్ రాంబాబు, అరుల్ మల్లిగి పార్థసారథి, చెలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు సౌందర్‌రాజన్ ప్రసంగిస్తారు. మేధావుల సూచనలు, సలహాలను టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదించాకే నిర్ణయం అవుతాయని ఈవో కృష్ణారావు స్పష్టంచేశారు.

సాధారణంగా ఆలయంలో లఘు అయితే గంటకు 3 వేల మంది , మహాలఘుఅయితే 5 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. రద్దీలేనప్పుడు కులశేఖరపడి వరకూ సామాన్యభక్తులను అనుతమిస్తున్నారు. ఎస్కలేటర్‌ ఏర్పాటు వలన సిబ్బందిపై దీర్ఘకాలంగా వస్తున్న విమర్శలకు చెక్‌పెట్టడమేకాకుండా , గంటకు 7 వేల మందికి స్వామివారి దర్శనాన్ని కల్పించవచ్చనే అంచనా వేస్తున్నారు. తలిగెలు , ఉత్సవమూర్తుల తరలింపు లాంటిసమస్యలు అర్చకులు ఈఓ దృష్టికి తెచ్చారు. దీనిపై వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. టిటిడి మాజీ ఈవో ఐవి. సుబ్బారావు కూడా ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని పేర్కొనడం గమన్హారం.

వెంకన్న సొమ్ముతో కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారం

సెక్యూరిటీ గార్డుల కాంట్రాక్టర్స్‌ గార్డులకివ్వాల్సిన 4 నెలల జీతంతో వడ్డీవ్యాపారం చేస్తున్నారు. దీంతో గత 4 నెలలుగా జీతాలు అందక టిటిడిలోని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు నానా అవస్థలు పడుతున్నారు. టిటిడిలో మొత్తం 1000 మందికి పైగా ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నాలుగు ప్రైవేట్‌ సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ సంస్థలు టిటిడికి ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను సరఫరా చేస్తుంది. ఈ నాలుగు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌ సంస్థలకు నెలకు 60 లక్షలకు పైగా జీతాలుగా టిటిడి చెల్లిస్తోంది. ఇలా గత 4 నెలలుగా చెల్ల్లించిన 2 కోట్ల రూపాయలను ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థలు వడ్డీకి వ్యాపారం చేస్తూ సెక్యూరిటీ గార్డ్స్‌కు జీతాలు చెల్లించడంలేదు. ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుల జీతంకోసం ఏజెన్సీలను ప్రశ్నిస్తే ఇంకా టిటిడి జీతాలు ఇవ్వలేదని చెబుతున్నారు. టిటిడి అధికారులు తాము చెల్లించామని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులకు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టిటిడిలో పరమనెంట్‌గా ఉండే సెక్యూరిటీ ఉన్నతాధికారి కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.