TTD ఆర్జిత సేవా టికెట్ల అమ్మకాల కుంభకోణం ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తిరుమలలో జరుగుతున్న ఆర్జిత సేవా టికెట్ల అమ్మకాల విక్రయంపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక అధికారి ధర్మారెడ్డిపై కిందికోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. ధర్మారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తదుపరి విచారణ కొనసాగించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
తిరుమల, బెంగళూర్, చెన్నై కేంద్రాలుగా ఆర్జిత సేవా టికెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు ముగ్గురు బోర్డు సభ్యుల వ్యక్తిగత సహాయకులను విచారించినట్లు తెలుస్తోంది. అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో పరువు కోసం టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు రంగంలోకి దిగారు. రాయల కాలంనాటి ఆభరణాలను పురావస్తు శాఖ ద్వారా పరీక్షలు చేయించి ధృవీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
Tuesday, August 3, 2010
Subscribe to:
Posts (Atom)